వరుణ్‌తో తలపడేది ఎవరో..?
close
Published : 23/01/2020 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుణ్‌తో తలపడేది ఎవరో..?

హైదరాబాద్‌: ఇటీవలే ‘గద్దలకొండ గణేష్‌’గా మాస్‌ కథాంశంతో వచ్చి విజయం అందుకున్నారు యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌. దీంతో ఆయన తదుపరి చిత్రం విషయంలో సినీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. వాళ్ల ఊహకు తగినట్లుగానే బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రానికి వరుణ్‌ శ్రీకారం చుట్టారు. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘బాక్సర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇందులో తేజ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నారు. అయితే ఈ కథలో విలన్‌ పాత్ర కీలకంగా ఉండబోతుందట. మరి ఇలాంటి వైవిధ్యభరిత ప్రతినాయక పాత్ర పోషించేందుకు ఎవరు బావుంటారని వెతికే ప్రయత్నంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి పేరు ప్రముఖంగా వినిపించింది.

విజయ్‌ సేతుపతి ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. ఇప్పటికే ‘సైరా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు విజయ్‌ సేతుపతి సుపరిచితులయ్యారు. దీంతో ఈ పాత్రకు విజయ్‌నే తీసుకుందామనుకుందట చిత్ర బృందం. కానీ, పలు కారణాల వల్ల విజయ్‌ స్థానంలో మరో నటుడ్ని ఎంపిక చేయబోతున్నారని సమాచారం. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరి వరుణ్‌తో ఎవరు తలపడతారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని