పవన్‌కల్యాణ్‌.. మూడు సినిమాలు నిజమెంత?
close
Updated : 29/01/2020 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌కల్యాణ్‌.. మూడు సినిమాలు నిజమెంత?

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌.. యువతలో విశేషమైన క్రేజ్‌ ఉన్న కథానాయకుడు. ఒక్క సన్నివేశంలో కనిపించినా, కాదు.. అసలు గొంతు వినిపించినా థియేటర్లు ఈలలు, అరుపులతో దద్దరిల్లిపోతాయి. ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఆయన నుంచి మరో చిత్రం రాలేదు. దీంతో పవన్‌ ఎప్పుడెప్పుడు సినిమాల్లో నటిస్తారా? అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు సమాధానం దొరికే తరుణం త్వరలోనే రాబోతోందా? పవన్‌ అభిమానులకు ఒకటి కాదు.. రెండు.. ఏకంగా ట్రిపుల్‌ ధమాకా అందనుందా? అంటే టాలీవుడ్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. పవన్‌ నుంచి రాబోతున్న ఆ మూడు ముచ్చట్లు ఏంటో చూద్దామా..!

ముచ్చట..1

పవన్‌ కల్యాణ్‌ మళ్లీ వెండితెరపై నటిస్తే చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే ఆ కోరిక తీరనుంది.  తాజాగా ఆయన ‘పింక్‌’ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. షూటింగ్‌లో పాల్గొన్నారంటూ ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. అయితే, దీనిపై ఆ చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారంలేదు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ  చిత్ర షూటింగ్‌ మాత్రం చకచకా జరిగిపోతోందని తెలుస్తోంది. నిప్పును ఎక్కువ రోజులు దాచి పెట్టలేరు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. 

ముచ్చట..2

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘గమ్యం’, ‘వేదం’, ‘కంచె’, ‘గౌతమి పుత్రశాతకర్ణి’ చిత్రాలతో తానేంటో నిరూపించారు క్రిష్‌. ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారట. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారట. బుధవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

ముచ్చట..3

ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లాయో లేదో తెలియదు గానీ, పవన్‌ మూడో సినిమా అంటూ మరో వార్త సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. ‘సైరా’లాంటి స్వాతంత్ర్య సమరయోధుడి కథలో ఆయన నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘పండగసాయన్న’ అనే స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కథలో పవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్‌. ‘పింక్‌’ రీమేక్‌, క్రిష్‌ చిత్రాల తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. 

అదుగో పవన్‌.. అంటే ఇదిగో సినిమా అన్నట్లు ప్రస్తుతం పవర్‌స్టార్‌ సినిమాలపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై పవన్‌కల్యాణ్‌ తరపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇందుకు కాలమే సమాధానం చెబుతుందేమో చూడాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని