‘జయం’ కలయికలో...
close
Published : 29/01/2020 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జయం’ కలయికలో...

తేజ దర్శకత్వంలో రూపొందిన ‘జయం’... గోపీచంద్‌ కెరీర్‌ని మలుపు తిప్పింది. అందులో ప్రతినాయకుడిగా కనిపించినా, ఆ సినిమా గోపీచంద్‌ సినీ జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత ఆయన కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి గోపీచంద్‌ - తేజ కలిసి ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కథ సిద్ధమైందని తెలుస్తోంది. గోపీచంద్‌ ‘సీటీమార్‌’తో బిజీగా ఉన్నారు. అది  పూర్తయ్యాక తేజ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి. రానాతోనూ తేజ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే కథని రానా కోసం తేజ సిద్ధం చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని