పవన్‌ సినిమాలో రేణు దేశాయ్‌..?
close
Published : 01/02/2020 16:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ సినిమాలో రేణు దేశాయ్‌..?

టాలీవుడ్‌లో ఊపందుకున్న టాక్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌-రేణు దేశాయ్‌ కాంబినేషన్‌లో విడుదలైన ‘బద్రి’ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట ‘జానీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తాజా సమాచారం ప్రకారం ముచ్చటగా మూడోసారి పవన్‌కల్యాణ్‌-రేణు కలిసి వెండితెరపై సందడి చేయనున్నారట. ఈ మేరకు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌.. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పింక్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు. దీనితోపాటు క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమాకు సంతకం చేశారు. తాజాగా హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో పవన్‌ ఓ సినిమాలో నటిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో పవన్‌ నటించే ఓ సినిమాలో రేణూ నటించనున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండనుందట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

మరోవైపు ఇటీవల రేణు దేశాయ్‌ సైతం.. మంచి పాత్రలు వస్తే తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఓ ఈవెంట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె వ్యవసాయం, రైతులకు సంబంధించిన కథతో ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని