అనసూయ అదిరిపోయే ఛాన్స్‌ కొట్టేసిందా?
close
Published : 04/02/2020 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనసూయ అదిరిపోయే ఛాన్స్‌ కొట్టేసిందా?

ఇంటర్నెట్‌డెస్క్‌: తన మాటలు, పంచ్‌లతో బుల్లితెర ప్రేక్షకులను రంజిపజేస్తున్న వ్యాఖ్యాత, నటి అనసూయ. అవకాశం వస్తే, వెండితెరపై తన నటనతో ఎలా మెప్పిస్తుందో ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా చూపించింది. అటు అభిమానులతో పాటు, ఇటు సినీ విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పాత్రను దక్కించుకున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలక పాత్రకు చిత్ర బృందం అనసూయను సంప్రదించిందట.

మొగలాయుల కాలం నాటి కథతో పాన్‌ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించబోతున్నారు. ఇందులో పవన్‌ రాబిన్‌ హుడ్‌ తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఆయనకు సహాయపడే ఓ కీలక పాత్రలో అనసూయ కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పాత్ర చేయడానికి ఆమె ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. మార్చి నుంచి సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖర్లో కానీ, వచ్చే సంక్రాంతికి కానీ విడుదల చేసే అవకాశముంది.

మరోవైపు సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ అనసూయ అవకాశం దక్కించుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ అనసూయ డబుల్‌ ధమాకా కొట్టేసినట్లే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని