మహేశ్‌ ద్విపాత్రాభినయం..?
close
Updated : 06/02/2020 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ ద్విపాత్రాభినయం..?

‘బాషా’ని పోలిన కథతో..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారట. ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఓ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మహేశ్‌ ప్రస్తుతం షూటింగ్‌ల నుంచి కొంత విరామం తీసుకుని కుటుంబసభ్యులతో కలిసి న్యూయార్క్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. మహేశ్‌ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారంటూ ఇటీవల నిర్మాత దిల్‌రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వంశీ-మహేశ్‌ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రానున్న సినిమాలో మహేశ్‌ ద్విపాత్రాభినయంలో నటించనున్నారట. అంతేకాకుండా రజనీకాంత్‌ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘బాషా’ సినిమాని పోలిన కథగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో మహేశ్‌బాబు ఓ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారంటూ టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

వంశీ పైడిపల్లి- మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమా ‘బ్లాక్‌బస్టర్‌’ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెరకెక్కించబోయే ఈ సినిమాలో మహేశ్‌ జంటగా కియారా అడ్వాణీ అయితే బాగుంటుందని నమ్రత భావిస్తున్నారట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని