close
Published : 06/02/2020 21:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్‌ఆర్‌ఆర్‌: అజయ్‌ ఆ నిర్ణయం తీసుకున్నారా?

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ సహా పలువురు హాలీవుడ్‌ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ.400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటీనటుల పారితోషికం కూడా భారీగానే ఉంటుంది. అయితే, నటుడు అజయ్‌ దేవగణ్‌ మాత్రం తన పాత్రకు రూపాయి కూడా తీసుకోవడం లేదా? అంటే టాలీవుడ్‌ వర్గాలు అవుననే చెబుతున్నాయి. 

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అజయ్‌ పోషిస్తున్న అతిథి పాత్ర కోసం ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. చిత్ర నిర్మాతలు అజయ్‌ మార్కెట్‌ ప్రకారం ఆయనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే, అజయ్‌ మాత్రం తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. ‘ఒక స్నేహితుడి కోసం స్నేహపూర్వకంగా అతిథి పాత్ర పోషించేందుకు ఒప్పుకొన్నాను. నాకు డబ్బులేమీ వద్దు’అన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

దాదాపు ఎనిమిదేళ్ల కిందట ‘ఈగ’ను అజయ్‌ హిందీలో డబ్‌ చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీళ్లిద్దరూ ‘ఆర్ఆర్‌ఆర్‌’ కోసం పనిచేస్తున్నారు. ‘2012 నుంచి రాజమౌళితో నా ప్రయాణం కొనసాగుతోంది. అనేక విధాలుగా మేం కలిసి పనిచేస్తున్నాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఆయనతో పనిచేయడం నాకు దక్కిన గౌరవం’’ అని అజయ్‌గతంలో ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

ఇందులో ఎన్టీఆర్‌ కొమరం భీంగా కనిపించనుండగా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆలియా భట్‌, రే స్టీవెన్‌సన్‌, ఓలివియా మోరిస్‌, అలీసన్‌ డూడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పోరాట యోధులు కొమరం భీం- అల్లూరి కలిస్తే ఎలా ఉంటుందన్న ఫిక్షనల్‌ కథతో జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని