తాతగారి పేరుతో...
close
Published : 10/02/2020 18:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాతగారి పేరుతో...

హైదరాబాద్‌: నాగచైతన్య వరుసగా కొత్త కథల్ని పట్టాలెక్కిస్తున్నారు. ‘లవ్‌స్టోరీ’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మరో కథ ఓకే చేసేశారు.  పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. 14 రీల్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి ‘నాగేశ్వరరావు’ అనే పేరు పెట్టినట్టు సమాచారం. నిర్మాణ సంస్థ ఈ పేరుని ఇటీవలే ఫిల్మ్‌ఛాంబర్‌లో నమోదు చేయించింది. దాంతో ఈ పేరు చైతూ సినిమా కోసమే అనే ప్రచారం జరుగుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని