అవును వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు..!
close
Published : 10/02/2020 23:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవును వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు..!

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌తో ప్రేమల్లో ఉన్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. వీళ్లిద్దరూ కలిసి లవ్‌ ఆజ్‌ కల్‌2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి సన్నిహితంగా ఉంటున్న ఈ ఇద్దరూ పలుమార్లు పార్టీలకు, డిన్నర్లకు జంటగా వెళ్లి కెమెరాకు చిక్కారు. దీంతో వీళ్లు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వార్తలు వినిపించాయి. గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా అలీఖాన్‌ మాట్లాడుతూ.. తనకు తొలి చూపు ప్రేమపై నమ్మకం ఉందని.. తనది కూడా అదే రకమైన ప్రేమ అని పేర్కొంది. దీనికి తోడు తాజాగా కార్తిక్‌ ఆర్యన్‌ ఆమెకు భోజనం కలిపి తినిపిస్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘నువ్వు బాగా సన్నగా అయిపోయావు. బాగా తిని మళ్లీ బరువు పెరగాలి’ అంటూ సారాను ఉద్దేశిస్తూ ఆ ఫొటో కింద రాసుకొచ్చాడు. అయితే ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సైఫ్‌ అలీఖాన్‌ హీరోగా వచ్చిన లవ్‌ ఆజ్‌ కల్‌ అప్పట్లో మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం లవ్‌ ఆజ్‌ కల్‌ 2. తండ్రి నటించిన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఇంతియాజ్‌ అలీ కూతురు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని