చైతూకు జోడీగా ఎవరు?
close
Published : 14/02/2020 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైతూకు జోడీగా ఎవరు?

హైదరాబాద్‌: ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’తో బిజీగా ఉన్నారు నాగచైతన్య. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే మరో చిత్రానికి చైతూ పచ్చజెండా ఊపారు.

పరశురామ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ‘నాగేశ్వరరావు’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం కథానాయిక వేట సాగుతోంది. రష్మిక, కీర్తి సురేష్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘లవ్‌ స్టోరీ’ తరవాత ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది. చైతూ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తారని, నాయిక పాత్రకీ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. మరి ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని