అదిరిపోయే ఫైట్లు.. ఆకట్టుకునే స్టెప్‌లు..!
close
Published : 18/02/2020 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదిరిపోయే ఫైట్లు.. ఆకట్టుకునే స్టెప్‌లు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: మాస్‌కు పర్యాయపదం చిరంజీవి. డ్యాన్స్‌లు, ఫైట్‌లతో తెలుగు చిత్ర పరిశ్రమలోని చెరగని ముద్రవేయడమే కాదు.. అశేష అభిమానులను సంపాదించుకున్నారు. రీఎంట్రీ తర్వాత కూడా దూకుడుగా ఉన్న ఆయన గతేడాది ‘సైరా’తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. త్రిష కథానాయిక. రామ్‌ చరణ్‌ నక్సలైట్‌ పాత్రలో మెరవబోతున్నట్లు సమాచారం. మాస్‌ కమర్షియల్‌ సినిమాకు సందేశం జోడించి తెరకెక్కించడంలో కొరటాల శివ సిద్ధహస్తుడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. 

తాజా చిత్రంలో చిరు డ్యాన్స్‌లు, ఫైట్లు ఆనాటి చిరంజీవిని గుర్తు చేస్తాయట. ఆ విధంగా దర్శకుడు కొరటాల సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. చిత్రీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్‌ ఎపిసోడ్లను పాటలనే షూట్‌ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇప్పటికే మూడు ఫైట్లు.. ఓ పాట చిత్రీకరణను పూర్తి చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం నాలుగో ఫైట్‌ను షూట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘ఆచార్య’ అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని