మహేశ్‌-వంశీ మూవీ ఆలస్యమయ్యేనా..?
close
Published : 23/02/2020 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌-వంశీ మూవీ ఆలస్యమయ్యేనా..?

టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్‌

హైదరాబాద్‌: ‘సరిలేరునీకెవ్వరు’ చిత్రంతో విజయాన్ని అందుకున్న మహేశ్‌బాబు త్వరలో వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించనున్నారనే విషయం తెలిసిందే. షూటింగ్‌ల నుంచి కొంత విరామం తీసుకున్న మహేశ్‌ ప్రస్తుతం తన కుటుంబసభ్యులతో కలిసి విదేశాల్లో సరదాగా గడుపుతున్నారు. టూర్‌ అనంతరం ఆయన వంశీ పైడిపల్లి సినిమా పనుల్లో పాల్గొననున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో మహేశ్‌ సినిమా కొంత ఆలస్యమయ్యేలా ఉందని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. మహేశ్‌ కోసం గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో సాగే ఓ కథను వంశీ రాశారట.. అయితే ఈ కథ మహేశ్‌కు అంతగా నచ్చలేదని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తుంది. అంతేకాకుండా వంశీ కథలోని కథానాయకుడి పాత్ర కూడా మహేశ్‌కు అంతగా నచ్చలేదట.. దీంతో స్ర్కిప్ట్‌పై మరోసారి వర్క్‌ చేయమని వంశీకి మహేశ్‌ సూచించారట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని