మెగా ఆఫర్‌ కొట్టేసిన సూపర్‌స్టార్‌..! 
close
Published : 27/02/2020 17:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగా ఆఫర్‌ కొట్టేసిన సూపర్‌స్టార్‌..! 

రామ్‌చరణ్‌ స్థానంలో మహేశ్‌ కనిపించనున్నారా..?

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మెగా ఆఫర్‌ కొట్టేశారని టాలీవుడ్‌ వర్గాలు అనుకుంటున్నాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రంలో రామ్‌చరణ్‌ స్థానంలో మహేశ్‌ కనిపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరు152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారంటూ గతకొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల రామ్‌చరణ్‌.. చిరు సినిమాలో నటించలేకపోతున్నారట. దీంతో చిత్రబృందం రామ్‌చరణ్‌ స్థానంలో మహేశ్‌బాబును తీసుకోవాలని భావిస్తుందట. ఒకవేళ మహేశ్‌ కనుక ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్తే.. చిరు-కొరటాల సినిమాలో ఆయన 30 నిమిషాలపాటు సందడి చేయనున్నారట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

దేవాదాయ శాఖలో అవినీతిని అరికట్టే కథాంశంతో ఈ సినిమా ఉండనుందని సమాచారం. అంతేకాకుండా చిరంజీవి దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నారట. ఈ సినిమాలో చిరుకి జంటగా త్రిష సందడి చేయనున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని