కలిసి రానున్న కమల్‌, రజనీ..!
close
Published : 27/02/2020 22:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలిసి రానున్న కమల్‌, రజనీ..!

చెన్నై: తమిళ సినిమాకు మూలస్తంభాలైన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ను ఒకే సినిమాలో చూసి దశాబ్దాలు దాటింది. అయితే, అభిమానులకు ఆ అవకాశం మళ్లీ రానుంది. దాదాపు 35ఏళ్ల తర్వాత ఈ ద్వయం ఒకే తెరపై కనిపించనుందట. సినిమా చిత్రీకరణ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సినిమా ప్రకటన మార్చి 5న రానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కమల్‌ హాసన్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తుందని తెలుస్తోంది. సినిమాలో తారాగణం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. మొదట్లో ఈ సినిమాకు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. తాజాగా హెచ్‌.వినోద్‌ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వినోద్‌ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గతంలో రజనీ, కమల్‌ కాంబినేషన్‌లో దాదాపు 16 సినిమాలు వచ్చాయి. మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు స్టార్‌ హీరోలను ఒకే సినిమాలో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరిసారిగా వీరిద్దరూ కలిసి బిగ్‌బీ అమితాబ్‌ సినిమా గిరఫ్తార్‌ చిత్రంలో 1985లో కనిపించారు. ఏదేమైనా స్టార్ హీరోలు కలిసి ఒకే తెరపై కనిపిస్తే పండగే కదా..! అందుకే ఈ వార్త నిజం కావాలని అభిమానులు ఆశపడుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని