మరోసారి జంటగా సాయిపల్లవి-శర్వానంద్‌..?
close
Published : 04/03/2020 22:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి జంటగా సాయిపల్లవి-శర్వానంద్‌..?

హైదరాబాద్‌: ‘పడిపడి లేచే మనసు’ సినిమాతో వెండితెరపై సందడి చేసిన జంట శర్వానంద్‌, సాయిపల్లవి. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలైన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను అందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్‌-సాయిపల్లవి మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. కిషోర్‌ తిరుమల త్వరలో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, ఆ చిత్రంలో సాయిపల్లవి-శర్వానంద్‌ జంటగా నటించనున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జూన్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని వార్తలు వస్తోన్నాయి. ప్రస్తుతం రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రెడ్‌’ సినిమాకి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘లవ్‌ స్టోరీ’ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు. దీనితోపాటు ఆమె రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో మెప్పించనున్నారు. ఇటీవల ‘జాను’ సినిమాతో మిశ్రమ ఫలితాలను అందుకున్న శర్వానంద్‌ ప్రస్తుతం ‘శ్రీకారం’ సినిమా చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని