విజయ్‌ దేవరకొండకు నో చెప్పిన దిశా పటానీ?
close
Published : 05/03/2020 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ దేవరకొండకు నో చెప్పిన దిశా పటానీ?

హైదరాబాద్‌: యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమా ‘ఫైటర్‌’. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలుగుతోపాటు హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు. అనన్యా పాండే కథానాయిక. ఈ సినిమాలో విజయ్‌ సరసన పాత్ర కోసం తొలుత దర్శక, నిర్మాతలు దిశా పటానీని సంప్రదించారట. కానీ నటించేందుకు ఆమె ఒప్పుకోలేదని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆమె తిరస్కరించడంతో తర్వాత అనన్యను కలిసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల సెట్‌లో తీసిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. విజయ్‌, అనన్య జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. విజయ్‌ బాక్సింగ్‌ కూడా నేర్చుకున్నారట. ఇది ఆయన తొలి హిందీ సినిమా కావడం విశేషం. పూరీ జగన్నాథ్‌-వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘లోఫర్‌’ సినిమాలో దిశా పటానీ తెలుగు తెరపై కనిపించిన సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని