షూటింగ్‌లో గాయపడిన అఖిల్‌..!
close
Updated : 05/03/2020 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షూటింగ్‌లో గాయపడిన అఖిల్‌..!

వారం రోజులపాటు చిత్రీకరణ వాయిదా

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ షూటింగ్‌లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ కొన్నిరోజుల నుంచి చెన్నైలో జరుగుతోంది. షూటింగ్‌లో భాగంగా తాజాగా అఖిల్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించిందట. అయితే చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అఖిల్‌ గాయపడ్డాడట. ప్రమాదంలో అఖిల్‌ కుడి మోచేతికి గాయమై బాగా వాయడంతో వైద్యులు వారం రోజులపాటు ఆయనకు విశ్రాంతిని సూచించారని పలు వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. దీనివల్ల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ షూటింగ్‌ను కొంతకాలంపాటు వాయిదా వేసినట్లు ఆయా వార్తల్లోని సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక వివరాలు వెలువడలేదు.

జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రానికి బన్నీవాస్‌, వాసు వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్‌ బాణీలను అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మనసా.. మనసా’ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. వేసవి కానుకగా ఏప్రిల్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని