కరోనా భయంతో ఆగిన స్టార్‌ హీరో సినిమా..?
close
Published : 07/03/2020 21:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా భయంతో ఆగిన స్టార్‌ హీరో సినిమా..?

ముంబయి: ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కారణంగా ఇప్పటికే పలు హాలీవుడ్ చిత్రాల షూటింగ్స్‌, ప్రమోషన్స్‌ నిలిచిపోవడంతోపాటు కొన్ని చిత్రాల రిలీజ్‌ డేట్స్‌ కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా వైరస్‌ కారణంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సినిమా షూటింగ్‌ కొంతకాలంపాటు వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే’. ఈ సినిమాలో సల్మాన్‌కు జంటగా దిశాపటానీ నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘రాధే’ సినిమాలో ఎంతో కీలకంగా ఉండబోయే యాక్షన్‌ సీక్వెన్స్‌ను అజర్‌బైజాన్‌లో చిత్రీకరించాలని చిత్రబృందం భావించిందట. అంతేకాకుండా అజర్‌బైజాన్‌లోనే సల్మాన్‌-దిశాలపై ఓ సాంగ్‌ను సైతం చిత్రీకరించాలనుకుందట. ఇందుకోసం ఇప్పటికే చిత్రబృందంలోని కొంతమంది సిబ్బంది బాకుకి చేరుకున్నారట.

ఇదిలా ఉండగా తాజాగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో చిత్రబృందం అజర్‌బైజాన్‌లో షూటింగ్‌ను కొంతకాలంపాటు రద్దు చేసిందని కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి.  అజర్‌బైజాన్‌లో చిత్రీకరించాల్సిన సన్నివేశాలను వేరే ఎక్కడైనా షూట్‌ చేద్దామా? లేక కొంతకాలం తర్వాత అక్కడే షూట్‌ చేద్దామా? అనే ఆలోచనలో ‘రాధే’ చిత్రబృందం ఉందని ఆయా వార్తల్లోని సమాచారం. దీనితోపాటు ఇప్పటికే బాకు చేరుకున్న బృందాన్ని సైతం వెంటనే ఇక్కడికి తిరిగి వచ్చేయాలని ‘రాధే’ బృందం సూచిందని తెలుస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని