‘బిల్లా రంగా’ రీమేక్‌లో చెర్రీ, మనోజ్‌?
close
Published : 14/03/2020 21:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బిల్లా రంగా’ రీమేక్‌లో చెర్రీ, మనోజ్‌?

జోరుగా ప్రచారం

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకులు రామ్‌ చరణ్‌, మంచు మనోజ్‌ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారా? నటించబోతున్నారనే అంటున్నారు ఫిల్మ్‌ నగర్‌. మెగాస్టార్‌ చిరంజీవి, డైలాగ్‌కింగ్‌ మోహన్‌బాబు కలిసి నటించిన సినిమా ‘బిల్లా రంగా’. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అప్పట్లో మంచి ఆదరణ లభించింది. కాగా దీన్ని ఇప్పుడు రీమేక్‌ చేయాలని భావిస్తున్నారట. చిరు పాత్రలో ఆయన కుమారుడు చెర్రీ, మోహన్‌బాబు పాత్రలో ఆయన కుమారుడు మనోజ్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే హీరోలు స్పందించాల్సిందే.

చెర్రీ ప్రస్తుతం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో నటిస్తున్నారు. కొన్నేళ్లపాటు నటనకు దూరంగా ఉన్న మనోజ్‌ ఇటీవల ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాకు సంతకం చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి చెర్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ‘బిల్లా రంగా’ రీమేక్‌ వార్తలు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని