నాలుగోసారీ కుదిరేనా..!
close
Published : 19/03/2020 18:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగోసారీ కుదిరేనా..!

విజయ్‌ సినిమా గురించి చక్కర్లు కొడుతోన్న వార్తలు

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్‌’. విజయ్‌ 64వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌కు ప్రతినాయకుడిగా మరో కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి నటించారు. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ‘మాస్టర్‌’ తర్వాత విజయ్‌ ఎవరి దర్శకత్వంలో నటించనున్నారనే విషయంలో నెట్టింట్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది.. విజయ్‌ తన తదుపరి చిత్రాన్ని సుధాకొంగర దర్శకత్వంలో చేయనున్నారని అంటుంటే.. మరికొంతమంది.. అజయ్‌ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో విజయ్‌ నటించనున్నారంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు. 

తాజా సమాచారం ప్రకారం.. విజయ్‌ తన తదుపరి చిత్రాన్ని ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో చేయనున్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ‘తుపాకీ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈసినిమా రానుందని పలు వెబ్‌సైట్లలో వార్తలు ప్రచూరితమయ్యాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విజయ్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌ గురించి వస్తోన్న వార్తలపై సంతోషం వ్యక్తం చేసిన నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతున్నారు. దీంతో #Thalapathy65 హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విజయ్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌లో ‘తుపాకీ’, ‘కత్తి’, ‘సర్కార్‌’ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని