‘పాగల్‌’తో ‘ఉప్పెన’ కథానాయిక?
close
Published : 24/03/2020 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పాగల్‌’తో ‘ఉప్పెన’ కథానాయిక?

హైదరాబాద్‌: ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రంలో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్‌ సేన్‌. ఇటీవల ‘హిట్‌’తో ప్రేక్షకులను అలరించారు. ఆయన కథానాయకుడుగా నరేశ్‌ కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో కథానాయికగా కృతి శెట్టిని తీసుకోవాలని భావిస్తున్నారట. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. 
కృతి ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వస్తోన్న ‘ఉప్పెన’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమానే ఆమెకు తొలి చిత్రం. మరోవైపు నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘18 పేజెస్‌’ చిత్రంలోనూ నాయికగా ఎంపికైనట్లు సమాచారం. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని