క్రిష్‌ సినిమాలో పవన్‌ అలా నటిస్తున్నారా?
close
Published : 27/03/2020 22:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రిష్‌ సినిమాలో పవన్‌ అలా నటిస్తున్నారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ సినిమా అంటే ఆయన అభిమానులకు ఒక పండగే. చాలా రోజులుగా రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. దీని తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ ఓ సినిమాలో నటించనున్నారు. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ టాక్‌ మొదలైంది. ఇందులో పవన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక రెండు భిన్న పాత్రల్లో కనిపిస్తారా? అన్నది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకూ పవన్‌ ద్విపాత్రాభినయం చేయలేదు. ఒకే సినిమాలో రెండు వైవిధ్య పాత్రలను పోషించిన సందర్భాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని