అల్లు అర్జున్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇస్తారా?
close
Published : 04/04/2020 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లు అర్జున్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇస్తారా?

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మెగా అభిమానులకు మంచి గిఫ్ట్‌ అందింది. చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ శ్రీరామనవమి కానుకగా విడుదలవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర బృందం అందుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే, మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో మరో ప్రైజ్‌ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్‌ టాక్‌.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్తూరు ప్రాంతంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. బన్ని ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడని ఇటీవలే వార్తలొచ్చాయి. తాజాగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. 

ఇటీవలే ఓ అభిమాని డిజైన్‌ చేసిన పోస్టర్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. చాలా మంది అదే ఫస్ట్‌లుక్‌ అనుకున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ స్పందించింది. ‘‘ఇది ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌. మేము అధికారికంగా ప్రకటించే వరకు దాన్ని చూస్తూ ఉండండి’’ అంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో బన్నీ బర్త్‌డేకి ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని టాక్‌ వినిపిస్తోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే పేరు పరిశీలనలో ఉంది. మరి ఫస్ట్‌లుక్‌ ఇస్తారా? మరొక సర్‌ప్రైజ్‌ ఇస్తారా అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని