‘ఎవరు’ రీమేక్‌ వార్తల్లో నిజమెంత..?
close
Published : 10/04/2020 20:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఎవరు’ రీమేక్‌ వార్తల్లో నిజమెంత..?

బెంగళూరు: అడివి శేష్‌, రెజీనా కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్‌’ అనే స్పానిష్‌ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్‌ రాంజీ దర్శకత్వం వహించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం అటు ప్రేక్షకుల నుంచి ఇటు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని త్వరలో కన్నడలో రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ‘ఎవరు’ చిత్రంలో అడివి శేష్‌ పోషించిన పాత్రను కన్నడలో నటుడు దిగాంత్‌ చేయనున్నారని అంతేకాకుండా ‘ఎవరు’ చిత్రానికి పనిచేసిన సాంకేతిక బృందమే ఈ రీమేక్‌ కోసం కూడా పనిచేయనున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, రీమేక్‌ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని