బాలకృష్ణ సినిమాలో భూమిక పాత్ర అదేనా?
close
Updated : 16/04/2020 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ సినిమాలో భూమిక పాత్ర అదేనా?

హైదరాబాద్‌: ఒకప్పుడు కథానాయిగా వరుస అవకాశాలు దక్కించుకున్న నటి భూమిక. వివాహం తర్వాత విరామం తీసుకున్న ఆమె రీఎంట్రీతో పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నయనతార నటించిన ‘వసంతకాలం’ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించిన ఆమె, ఇప్పుడు ఏకంగా అగ్ర కథానాయకుడు బాలయ్యకు విలన్‌గా నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్‌ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి చిత్రంలోని ఇతర పాత్రలపై దృష్టి సారించారట. ఇందులో భాగంగా ప్రతినాయక ఛాయలున్న పాత్ర కోసం భూమికను తీసుకుంటే ఎలా ఉంటుందని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని సమాచారం. 

గతంలో బాలకృష్ణ నటించిన ‘రూలర్‌’ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ నటిస్తుండటం, అది కూడా ప్రతినాయకురాలి పాత్ర కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి భూమిక.. బాలయ్యకు విలన్‌గా కనిపిస్తుందా? లేదా కథను మలుపు తిప్పే పాత్రా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల అనంతరం బోయపాటి, బాలకృష్ణ కయికలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. నాయిక వివరాలు ఇంకా ఖరారు కాలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని