ఎన్టీఆర్‌ బర్త్‌డేకి డబుల్‌ ట్రీట్‌ వస్తుందా?
close
Published : 21/04/2020 09:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ బర్త్‌డేకి డబుల్‌ ట్రీట్‌ వస్తుందా?

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ పుట్టిన రోజున ఆయన అభిమానులు డబుల్‌ ట్రీట్‌ అందుకోనున్నారా? అంటే టాలీవుడ్‌ టాక్‌ అవుననే వినిపిస్తోంది. తారక్‌-రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్ర షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమాలో నటించనున్నారు. 

కాగా, మే 20న ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రెండు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నట్లు సమాచారం. ఇటీవలే చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ విడుదల చేశారు. అలాగే ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, అది ఎలా ఉంటుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఎందుకంటే రామ్‌చరణ్‌ పుట్టినరోజున విడుదల చేసిన టీజర్‌ వర్క్‌ అంతా లాక్‌డౌన్‌కు ముందే అయిపోయిందట. అయితే, తారక్‌ టీజర్‌ రెడీ చేసేందుకు సిద్ధమయ్యేసరికి లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రస్తుతం టీజర్‌కు సరిపడా సరకు అంతా సర్వర్‌లో ఉందని, ఉన్న మెటీరియల్‌తో కొంత వరకూ చేస్తున్నట్లు తాజాగా రాజమౌళి చెప్పారు. ఇంకొంత షూట్‌ చేయాల్సి ఉందన్నారు. మరి ఇప్పటికే తీసిన సన్నివేశాలతో టీజర్‌ విడుదల చేస్తారా? లేదా? అన్నది తెలియాలంటే లాక్‌డౌన్‌ పూర్తి కావాలి. 

ఇక ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి సంబంధించి టైటిల్‌ను ఆ రోజు ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌పై త్రివిక్రమ్‌ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని