బన్నీతో చిందేయనున్న బాలీవుడ్‌ భామ?
close
Published : 01/05/2020 21:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీతో చిందేయనున్న బాలీవుడ్‌ భామ?

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకుడు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందట. దానికి దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం సమకూరుస్తున్నారని.. బన్నీ-సుక్కు కాంబినేషన్‌లో వచ్చిన ప్రత్యేక గీతాలు ఎలా అలరించాయో ఇది కూడా అలానే ఆకట్టుకుంటుందని మొదటి నుంచి చెప్పుకొచ్చారు. కాగా ఇప్పుడు ఈ ప్రత్యేక గీతానికి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో ‘లోఫర్‌’ హీరోయిన్‌ దిశా పటానీ ఆడిపాడనున్నట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. దిశా ఇప్పటికే బాలీవుడ్‌లో పలు ప్రత్యేక గీతాల్లో నటించారు.

చిత్తూరు ప్రాంతంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. బన్నీ ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారట. రష్మిక కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, అనసూయ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని