విజయ్‌ సంకేతాలు ఇచ్చారా?
close
Published : 12/05/2020 21:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ సంకేతాలు ఇచ్చారా?

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోందా? అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. విజయ్‌ కూడా అదే రకమైన సంకేతాలు ఇచ్చారు. దిల్‌రాజు   నిర్మాణంలో ఈ కలయికలో సినిమా రూపొందే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి ‘వి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో నాగచైతన్యతో ఓ సినిమా చేస్తారని సమాచారం. విజయ్‌ కోసం కూడా మోహనకృష్ణ ఓ కథని సిద్ధం చేసి వినిపించారని తెలిసింది. విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ ‘మీరు చేయబోయే అద్భుతమైన పనుల గురించి మేం ఎదురు చూస్తున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు మోహనకృష్ణ ఇంద్రగంటి. దానికి విజయ్‌ దేవరకొండ బదులిస్తూ.. మనం ఇద్దరం కలిసి చేయబోయే ఒక అద్భుతమైన పని గురించి నాకు తెలుసంటూ ట్వీట్‌ చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని