‘బ్యాచ్‌లర్‌’ను అప్పటికి రెడీ చేస్తున్నారా?
close
Updated : 16/05/2020 21:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బ్యాచ్‌లర్‌’ను అప్పటికి రెడీ చేస్తున్నారా?

హైదరాబాద్‌: బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డే నాయిక. గీతా ఆర్ట్స్‌ 2 సంస్థ నిర్మిస్తోంది. ఈ వేసవికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్‌ ముగిసినా.. థియేటర్లు ఓపెన్‌ అవడానికి కొంత సమయం పడుతుంది.

ఓటీటీలో విడుదలకు కొందరు నిర్మాతలు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా విడుదల గురించి టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఎంత ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తోందట చిత్ర బృందం. దసరా కానుకగా ‘బ్యాచ్‌లర్‌’ పలకరిస్తాడని టాలీవుడ్‌ టాక్‌. దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని