ఆ ఇద్దరిలో మంగ ఎవరు?
close
Published : 31/05/2020 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఇద్దరిలో మంగ ఎవరు?

హైదరాబాద్‌: గోపీచంద్‌ కథా నాయకుడిగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం కోసం తేజ ఓ విభిన్నమైన కథని సిద్ధం చేశారు. అలిమేలు మంగ పాత్ర కోసం అగ్ర కథానాయికలు పేర్లని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో ఒకరు చందమామ’ కాజల్‌ కాగా, మరొకరు ‘దేవసేన’ అనుష్క. మరి ఈ ఇద్దరిలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. చిత్రీకరణలు మొదలయ్యాక ఆయా నాయికలు ఒప్పుకొన్న చిత్రాలు, వాళ్ల వెసులుబాటు మేరకే తుది ఎంపిక ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం కాజల్‌ చేతినిండా సినిమాలు ఉన్నాయి. ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ చిత్రంలోనూ కాజల్‌ నటిస్తోంది. మరోవైపు అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ మాత్రమే విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ అనుష్క తన కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని