బాలకృష్ణ మళ్లీ పాడబోతున్నారా?
close
Published : 02/06/2020 21:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ మళ్లీ పాడబోతున్నారా?

హైదరాబాద్‌: నందమూరి అభిమానులు, సినీప్రియులకు తన పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వబోతున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జూన్‌ 10న బాలయ్య  పుట్టినరోజును పురస్కరించుకుని ఓ చక్కటి కానుక అందివ్వబోతున్నారట. 

సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తో పాటు ఓ పాటను కూడా విడుదల చేస్తున్నారని సమాచారం. అయితే, ఆ పాటను బాలకృష్ణే స్వయంగా ఆలపించడం విశేషం. గతంలో ఆయన పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్‌’చిత్రంలో పాట పాడి మెప్పించారు. ఇప్పుడు మరోసారి బోయపాటి సినిమా కోసం గొంతు సవరించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాట రికార్డింగ్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘త్వరలో మళ్లీ నా పాటతో సామాజిక మాధ్యమాల్లో సందడి చెయ్యబోతున్నా. దీనికి పెద్దగా సమయం కూడా తీసుకోవాలనుకోవట్లేదు. మరో నాలుగైదు రోజులంతే’’ అంటూ పాటపై క్లూ ఇచ్చేశారు. మరి నిజంగా బాలకృష్ణ పాడిన పాటను విడుదల చేస్తారా? లేక ఇంకేదైనా సర్‌ప్రైజ్‌ ఇస్తారా? చూడాలి. ఈ చిత్రం కోసం ‘మోనార్క్‌’ అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని