గుడిలో నయన్‌-విఘ్నేశ్‌ వివాహం..?
close
Updated : 06/06/2020 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుడిలో నయన్‌-విఘ్నేశ్‌ వివాహం..?

నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వార్తలు

చెన్నై: అగ్రకథానాయిక నయనతార త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ను ఆమె పెళ్లి చేసుకోనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన వీరిద్దరూ అతి త్వరలోనే తమిళనాడులోని ఓ గుడిలో వివాహం చేసుకోనున్నారని..  తక్కువ మంది బంధువులు మాత్రమే హాజరు కానున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ శుభవార్తతో నయన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నయన్‌-విఘ్నేశ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. అయితే తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నయన్‌ కానీ, విఘ్నేశ్‌ కానీ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

నయన్‌ కథానాయిక 2015లో తెరకెక్కిన ‘నేనూ రౌడీనే’ సినిమా సమయంలో విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి దిగిన పలు ఫొటోలను విఘ్నేశ్‌ తరచూ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తుంటారు. ప్రస్తుతం నయన్‌.. ‘నెట్రికారన్‌’, ‘కాతువక్కుల రెండు కాదల్‌’, ‘ముక్తి అమ్మన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని