మొన్న ‘రింగరింగ’.. నేడు ‘సీటీమార్‌’..?
close
Updated : 08/06/2020 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొన్న ‘రింగరింగ’.. నేడు ‘సీటీమార్‌’..?

బన్నీ పాటకు సల్మాన్‌ ఆట

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మరోసారి స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాట రీమిక్స్‌కు స్టెప్పులు వేయబోతున్నారట. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘రాధే: ది మోస్ట్ వాంటెడ్‌ భాయ్‌’. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ, రణ్‌దీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మే 22న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా కుదరలేదు.

కాగా ఈ సినిమా కోసం ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమాలోని ‘సీటీమార్‌..’ పాటను రీమిక్స్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బన్నీ నటించిన ‘ఆర్య 2’లోని ‘రింగ రింగ..’ పాటను సల్మాన్‌ ‘రెడీ’ సినిమా కోసం రీమిక్స్‌ చేశారు. ‘డింకచికా.. డింకచికా..’గా పాటను రూపొందించారు. ఇప్పుడు మరోసారి సల్మాన్‌ టాలీవుడ్‌ పాటకు స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘దేవిశ్రీ ప్రసాద్‌ ఈ రీమిక్స్‌ కోసం పనిచేస్తున్నారు. ఆయన, సల్మాన్‌ 2011లో ‘డింక చికా..’ పాట కోసం కలిసి పనిచేశారు. ‘సీటీమార్‌..’ రీమిక్స్‌ కూడా అందర్నీ అలరిస్తుందని’ విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. సల్మాన్‌ 2019లో ‘భారత్‌’, ‘దబాంగ్‌ 3’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని తర్వాత ‘రాధే’కు సంతకం చేశారు. మరోపక్క ఆయన, ఫర్హాద్‌ సాంజీ కాంబినేషన్‌లో ‘కబి ఈద్‌ కబి దివాళీ’ సినిమా రూపొందనుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని