మరోసారి జోడీగా చై-సమంత?
close
Published : 03/07/2020 23:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి జోడీగా చై-సమంత?

హైదరాబాద్‌: నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ‘థ్యాంక్‌ యూ’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నాగచైతన్య సరసన ఆయన అర్థాంగి సమంత నటించే అవకాశాలున్నట్టు సమాచారం.

పెళ్లి తర్వాత ఈ జోడీ ‘మజిలీ’లో నటించి విజయాన్ని అందుకున్నారు. ‘థ్యాంక్‌ యూ’ కథ నచ్చడంతో చైతూ, సమంత నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ‘మనం’ తర్వాత నాగచైతన్య - విక్రమ్‌ కె.కుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని