కల్యాణ్‌రామ్‌ సినిమా... ‘ఎమిగోస్‌’?
close
Published : 02/05/2021 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కల్యాణ్‌రామ్‌ సినిమా... ‘ఎమిగోస్‌’?

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 19వ సినిమా ఇది. దీనికి ‘ఎమిగోస్‌’ అనే పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ‘ఎమిగోస్‌’ అంటే తెలుగులో స్నేహితులు అని అర్థం. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. మరి మూడు పాత్రలా లేక, రెండు పాత్రలా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. కథానాయిక ఎంపికపై కూడా కసరత్తు చేస్తోంది చిత్రబృందం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని