చిరు152 సినిమా షూటింగ్‌ ప్రారంభం
close
Updated : 02/01/2020 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు152 సినిమా షూటింగ్‌ ప్రారంభం

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న మెగాస్టార్‌ ఫొటో

హైదరాబాద్‌ : టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గతేడాది విజయదశమి రోజు జరిగినప్పటికీ నేటి నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ జరగనుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్‌ ఓ స్పెషల్ పోస్ట్‌ పెట్టింది. రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా త్రిష నటించనున్నారు. దేవాదాయ శాఖలో అవినీతిని అరికట్టే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం అంతేకాకుండా ఈ సినిమాలో చిరు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నారట.

ఇదిలా ఉండగా చిరంజీవి న్యూలుక్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో చిరంజీవి చాలా సాధారణమైన లుక్‌లో కనిపించారు. చిరంజీవి లుక్‌ చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. ఆయన చాలా కూల్‌గా, సూపర్‌గా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా కొరటాల చిత్రంలో చిరంజీవి ఇలా కనిపించనున్నారంటూ మాట్లాడుకుంటున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని