‘అల వైకుంఠపురములో..’ నుంచి స్పెషల్‌ వీడియో..!
close
Published : 03/01/2020 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల వైకుంఠపురములో..’ నుంచి స్పెషల్‌ వీడియో..!

హైదరాబాద్‌: స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 6న హైదరాబాద్‌ యూసఫ్‌గూడలో ఓ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. ‘ఎప్పటికీ గుర్తుండిపోయే స్టైలిష్‌ సంక్రాంతికి సంబంధించిన కర్టన్‌రైజర్‌. అల..వైకుంఠపురములో టైటిల్‌ సాంగ్‌. జనవరి 6న యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో #AVPLMusicalConcert’ అని గీతా ఆర్ట్స్‌ పేర్కొంది.

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో చిత్రమిది. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజాహెగ్డే నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని