పైలెట్‌గా శింబు
close
Updated : 04/01/2020 08:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పైలెట్‌గా శింబు

‘మహా’లో శింబు

కోడంబాక్కం: శింబు, హన్సిక కలిసి నటించిన చిత్రం ‘వాలు’. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. తర్వాత ఇద్దరూ విడిపోయారు. దీంతో చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి ‘మహా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది కథానాయిక ప్రాముఖ్యత కలిగిన చిత్రం. శింబు అతిథిపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తంబిరామయ్య, సనంశెట్టి, కరుణాకరన్‌ ఇతర తారాగణం. ఇది హన్సికకు 50వ చిత్రం కావడం విశేషం. యూఆర్‌ జమీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెకెండ్‌ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. దీన్నిబట్టి చూస్తే శింబు పైలెట్‌గా నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాకుండా శింబు అభిమానులను ఈ లుక్‌ కట్టిపడేస్తోంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మార్చుతున్నారు. కొంత కాలంగా సరైన హిట్‌ కోసం శింబు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అభిమానులను తృప్తిపరిచే విధంగా ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని