బన్నీ సినిమా: దక్షిణాదిలోనే తొలిసారిగా..!
close
Published : 05/01/2020 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీ సినిమా: దక్షిణాదిలోనే తొలిసారిగా..!

‘అల వైకుంఠపురములో..’ మ్యూజికల్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సినిమా మ్యూజికల్‌ ఫెస్టివల్‌ను యూసఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో సోమవారం వినూత్నంగా జరపబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం 52 అడుగుల పొడవు, 162 అడుగుల వెడల్పుతో ఉన్న వేదికను అలంకరించనున్నారు. దక్షిణాదిలో ఇంత భారీగా స్టేజ్‌ వెయ్యడం ఇదే మొదటిసారని చిత్ర బృందం పేర్కొంది. ఈ కార్యక్రమంలో తమన్‌, శివమణి, సిద్ శ్రీరామ్‌, అర్మాన్‌ మాలిక్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, రోల్‌ రైడ, లేడి కాశ్‌, రాహుల్‌ నంబియర్‌, అనురాగ్‌ కులకర్ణి, ప్రియ సిస్టర్స్‌ లైవ్‌లో ప్రదర్శన ఇవ్వబోతుండటం విశేషం.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని