జనవరి 11న బొమ్మ దద్దరిల్లిపోద్ది: అనిల్‌ రావిపూడి
close
Published : 05/01/2020 21:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనవరి 11న బొమ్మ దద్దరిల్లిపోద్ది: అనిల్‌ రావిపూడి

హైదరాబాద్‌: ‘ఉదయాన్నే కొడుకు పుట్టాడు. సాయంత్రం మెగా సూపర్‌‌ ఈవెంట్‌. ఇలాంటి రోజు నెవ్వరు బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌. ఈరోజును నా జీవితంలో మర్చిపోలేను’ అని అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. మహేశ్‌బాబు కథానాయకుడి ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఈ చిత్ర మెగా సూపర్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు. చిరంజీవి పేరు వెండితెరపై ఎప్పటికీ వెలిగిపోవాలని కోరుకుంటున్నా. నాలో మొదట పుట్టిన ఆర్ట్‌ డ్యాన్స్‌కు చిరంజీవిగారే స్ఫూర్తి. చిన్నప్పుడు ఆయన పాటలకు డ్యాన్స్‌లు వేస్తే చాలా ప్రైజ్‌లు వచ్చాయి. ఆయన కొత్త చిత్రానికి నా శుభాకాంక్షలు. విజయశాంతిగారు నటించడం ద్వారా సంక్రాంతికి మా సినిమాలో కొత్త రంగుల ముగ్గును తెచ్చారు. ఆమె చేసిన పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోయా. భారతి పాత్రకు ప్రాణం పోశారు. పవర్‌ ఆఫ్‌ విమెన్‌ అనేది మరోసారి చూడబోతున్నారు. రాజేంద్రప్రసాద్‌గారు, ప్రకాష్‌రాజ్‌గారు అద్భుతంగా నటించారు. రష్మిక, సంగీత చాలా సందడి చేశారు. రత్నవేల్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్‌ కూడా ఈ సినిమాలో ఉంది. కృష్ణగారు కూడా కనిపిస్తారు. ఆయన ఎలా కనిపిస్తారో మీరు వెండితెరపై చూడాలి. ‘ఎఫ్‌2’ విడుదల కాగానే మహేశ్‌గారికి ఈ కథ చెప్పా. ఆయన ‘సినిమా చేస్తున్నాం’ అని నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన దానికి నేను జనవరి 11న ఒక మంచి హిట్‌ ఇవ్వాలనుకుంటున్నాను. సినిమా బాగా వచ్చింది. జనవరి 11న బొమ్మ దద్దరిల్లిపోద్ది’’ అని అనిల్‌ రావిపూడి అన్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని