త్రివిక్రమ్‌ నుంచి చాలా నేర్చుకున్నా: సుశాంత్‌
close
Published : 07/01/2020 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్రివిక్రమ్‌ నుంచి చాలా నేర్చుకున్నా: సుశాంత్‌

హైదరాబాద్‌: ‘అల వైకుంఠపురములో’ నటించడం వల్ల త్రివిక్రమ్‌ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు యువ కథానాయకుడు సుశాంత్‌. సోమవారం జరిగిన ఈ సినిమా మ్యూజికల్‌ నైట్‌ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఇందులో నటించే అవకాశం కల్పించిన బన్ని, త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. అసలు ఈ సినిమాలో నేను నటిస్తానని అనుకోలేదు. ఒకరోజు సడెన్‌గా నాగ వంశీగారి నుంచి ఫోన్‌ వచ్చింది. సినిమా చేయమని అడగ్గానే చాలా ఉత్సాహమేసింది. త్రివిక్రమ్‌గారు కథ చెప్పగానే ఒకే చెప్పా.  ఈ అవకాశం రావడం నా అదృష్టం. త్రివిక్రమ్‌గారి నుంచి చాలా నేర్చుకున్నా. నన్ను నాకే కొత్తగా చూపించారు. రెండు, మూడు వెర్షన్లలో చూపించారు. ‘ఇలా కూడా చేయొచ్చా’ అని మానిటర్‌ చూస్తే అర్థమైంది. బన్నితో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ‘నిన్నే పెళ్లాడతా’ సెట్‌లో తొలిసారి టబుగారిని కలిశా. ఆ తర్వాత ముంబయిలో యాక్టింగ్‌ కోర్సు చేసేటప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమా చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశా’’ అని అన్నారు. 

‘‘బుట్టబొమ్మ’ పాట రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాట విన్న తర్వాత మా గురువుగారు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఇచ్చిన కితాబు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌గారికి, బన్నికి ధన్యవాదాలు’’ అని అన్నారు ప్రముఖ గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని