పండక్కి మేమే మీ ఇంటికి వచ్చినట్లు ఉంటుంది
close
Published : 07/01/2020 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పండక్కి మేమే మీ ఇంటికి వచ్చినట్లు ఉంటుంది

హైదరాబాద్‌: పండగకు వచ్చే ‘అల వైకుంఠపురం’తో ప్రతి రోజూ పండగేనని అన్నారు నటుడు సునీల్‌. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సోమవారం జరిగిన మ్యూజికల్‌ నైట్‌లో సునీల్‌ మాట్లాడారు. ‘‘ఈ సినిమా ఎలా ఉంటుందంటే.. పండగపూట మీరందరూ కలిసి ఒక్కసారి టికెట్‌ కొనుక్కొని, థియేటర్‌లోకి వెళ్లి కూర్చుంటే బన్ని, పూజా హెగ్డే, టబు, సచిన్‌, నేను, సముద్రఖని పండక్కి మీ ఇంటికి వచ్చినట్లు ఉంటుంది. మీరు థియేటర్‌కు వచ్చినట్లు ఉండదు. మేమే మీ ఇంటికి వచ్చినట్లు ఉంటుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సునీల్‌ అనే బట్టలు కొన్నాడు. బయటకు వచ్చినప్పుడు బట్టలు వేసుకోవాలి కాబట్టి, తను తీసే ప్రతి సినిమాలోనూ నన్ను కూడా పడేస్తుంటాడు. థాంక్యూ. ‘పరుగు’ షూటింగ్‌ జరుగుతుండగా ఒక హీరో కారావాన్‌లో ఆర్టిస్టులందరం కలిసి కూర్చున్నది అప్పుడే. ‘ఆర్య’, ‘పరుగు’ చిత్రాల తర్వాత బన్నితో చేయడం ఇదే. ఈ సినిమా చాలా పెద్ద హిట్టవుతుంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వరస్వామిని కలిసి నేను ప్రార్థించా. ‘బయట ఎక్కడా చెప్పకురా అబ్బాయ్‌.. ఈ సినిమా చూసేవాళ్లకు నిజంగా పండగే’ అని వేంకటేశ్వరస్వామి నాతో చెప్పారు. ఇక మీరంతా పండగ చేసుకోండి’’ అని సునీల్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కథానాయిక నివేదా పేతురాజుతో కలిసి సునీల్‌ చేసిన సందడి ఆకట్టుకుంది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని