భయపెట్టడానికి భాషతో పనిలేదు..!
close
Published : 08/01/2020 21:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయపెట్టడానికి భాషతో పనిలేదు..!

ఉత్కంఠగా ‘సైకో’ ట్రైలర్‌

హైదరాబాద్‌: భయపెట్టడానికి భాషతో పనిలేదని నిరూపించింది ‘సైకో’ చిత్ర బృందం. ఉదయనిధి స్టాలిన్‌, అదితిరావు హైదరి, నిత్యా మేనన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. మిస్కిన్‌ దర్శకుడు. ఇళయరాజా బాణీలు అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా చిత్రాన్ని రూపొందించినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ ప్రచార చిత్రంలో ఒక్క డైలాగ్‌ కూడా లేదు.. కేవలం మ్యూజిక్‌తోనే సాగడం విశేషం. అతిదిరావు ఓపక్క బ్యూటిఫుల్‌గా కనిపిస్తూనే.. మరోపక్క సస్పెన్స్‌ పాత్రలో అలరించారు. దాదాపు అన్ని సన్నివేశాల్ని చీకటిలోనే చిత్రీకరించారు. ఉదయనిధి స్టాలిన్‌ అంధుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. హత్యలు, పోలీసులు నేపథ్యంలో ఉన్న ఈ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

 



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని