ఎన్టీఆర్‌ చేతులమీదుగా కల్యాణ్‌రామ్‌ ట్రైలర్‌
close
Published : 08/01/2020 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ చేతులమీదుగా కల్యాణ్‌రామ్‌ ట్రైలర్‌

హైదరాబాద్‌: తన సోదరుడు కల్యాణ్‌రామ్‌ నటించిన ‘ఎంత మంచివాడవురా!’ సినిమా ట్రైలర్‌ను కథానాయకుడు ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను బుధవారం సాయంత్రం నిర్వహించారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెషన్‌ దీనికి వేదికైంది. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ హాజరై, ట్రైలర్‌ను విడుదల చేశారు. కుటుంబ కథా చిత్రంగా, యాక్షన్‌ను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ‘తాతయ్య దగ్గర శివ, ఊర్లో సూర్య, ఈ అమ్మాయి దగ్గర రిషి.. ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కో పేరు, బంధం..’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. తనను ప్రేమించాలని మెహరీన్‌ కల్యాణ్‌రామ్‌ వెంటపడ్డారు. ‘ఎదిరించేవాడు రానంత వరకే రా.. భయపెట్టేవాడి రాజ్యం..’ అని కల్యాణ్‌రామ్‌ చెప్పిన డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా అనిపించింది.

ఈ సినిమాకు సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహించారు. మెహరీన్‌ కథానాయిక. గోపీ సుందర్ బాణీలు అందించారు. జనవరి 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘118’ తర్వాత కల్యాణ్‌ నటించిన సినిమా ఇది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని