‘సరిలేరునీకెవ్వరు’ మూవీ మేకింగ్‌..!
close
Updated : 09/01/2020 10:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సరిలేరునీకెవ్వరు’ మూవీ మేకింగ్‌..!

డైరెక్టర్‌ టు యాక్టర్‌.. ఆద్యంతం నవ్వులే

హైదరాబాద్‌: అనిల్‌ రావిపూడి.. కామెడీని పండించడంలో ఆయనకు ఆయనే సాటి. కామెడీలో మంచి టైమింగ్‌ ఉన్న డైరెక్టర్‌కు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోయిజం తోడైతే.. ‘సరిలేరు నీకెవ్వరు’ అనాల్సిందే. తొలిసారి వారిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో (జనవరి11) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం ‘సరిలేరు నీకెవ్వరు’ మేకింగ్‌ వీడియోను మహేశ్‌బాబు సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో సినిమా సెట్స్‌తోపాటు సినిమాలోని కొన్ని సన్నివేశాల మేకింగ్‌ను చూపించారు. సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచే రైలు సీన్‌ షూటింగ్‌, కొండారెడ్డి బురుజు మేకింగ్‌ ఇలా ప్రతిదాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు. వీడియో ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ సరదాగా సాగింది. ప్రతి సన్నివేశంలో కూడా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితోపాటు, మహేశ్‌ బాబు ఇతర నటీనటులు నవ్వుతూనే కనిపిస్తారు. ఈ వీడియో చూసిన అభిమానులు ‘ఇలాంటి వీడియో నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌’ అని కామెంట్లు పెడుతున్నారు. 

ఈ సినిమాలో మహేష్‌ బాబు ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. ప్రొఫెసర్‌ భారతిగా ‘విశ్వనట భారతి’ విజయశాంతి కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. దిల్‌రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మాతలుగా వ్యవహరించారు.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని