ఫొటోతో అప్‌డేట్‌ చెప్పిన ప్రభాస్‌
close
Published : 17/01/2020 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫొటోతో అప్‌డేట్‌ చెప్పిన ప్రభాస్‌

హైదరాబాద్‌: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన తర్వాతి సినిమా అప్‌డేట్‌ చెప్పారు. శుక్రవారం నుంచి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెట్‌లో తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘నా తర్వాతి సినిమా షూటింగ్‌లో తిరిగి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఫన్‌ షెడ్యూల్‌ కాబోతోందని ఆశిస్తున్నా’ అని పోస్ట్‌ చేశారు.

‘సాహో’ తర్వాత ప్రభాస్‌ ఎస్‌.రాధాకృష్ణ సినిమాలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఒకటి ఇటలీలో, మరొకటి హైదరాబాద్‌లో జరిగింది. ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘జాన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సెట్‌ ఏర్పాటులో జాప్యం కారణంగా మూడో షెడ్యూల్‌ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు అన్నీ కుదరడంతో మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని