‘అల..వైకుంఠపురములో..’ సరికొత్త రికార్డ్‌
close
Published : 18/01/2020 16:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల..వైకుంఠపురములో..’ సరికొత్త రికార్డ్‌

2020లో భారత్‌ నుంచి తొలి సినిమా ఇదే..!

హైదరాబాద్: అల్లు అర్జున్‌ కథానాయకుడు నటించిన ‘అల..వైకుంఠపురములో..’ సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. షేర్స్‌ విషయంలో ఇప్పటికే నాన్‌ బాహుబలి-2 రికార్డ్‌ను సొంతం చేసుకున్న ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం తాజాగా ఈ ఏడాది 2 మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరిన మొదటి తెలుగు సినిమాగా రికార్డ్‌ను సొంతం చేసుకున్నట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా 2మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరిన మొదటి అల్లు అర్జున్‌ సినిమా ఇదేనని వారు వెల్లడించారు.

మరోవైపు ‘అల..వైకుంఠపురములో..’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని త్వరలో అభిమానులతో సెలబ్రేట్‌ చేసుకోనున్నట్లు బన్నీ తెలిపారు. ఈమేరకు ఈ నెల 19న వైజాగ్‌లో, 24న తిరుపతిలో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను నిర్వహించనున్నట్లు బన్నీ వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద వేలాది మంది సందడి, మిలియన్లలో ప్రశంసలు, కోట్లలో కలెక్షన్స్‌.. వీటన్నింటినీ మించి మీ ప్రేమాభిమానాలు. మీరు మాకందించిన ఈ విజయాన్ని తప్పకుండా సెలబ్రేట్‌ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కు తప్పకుండా హాజరు కాగలరు.’ అని బన్నీ పేర్కొన్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని