‘ఉప్పెన’లా వచ్చేసిన వైష్ణవ్‌ తేజ్‌
close
Updated : 23/01/2020 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’లా వచ్చేసిన వైష్ణవ్‌ తేజ్‌

ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్‌

హైదరాబాద్‌: సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపించి వైష్ణవ్‌ సినీ ప్రియులను మెప్పించారు. అయితే తాజాగా గురువారం సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో వైష్ణవ్‌ మాస్‌, లవర్‌బాయ్‌ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని