‘సరిలేరు నీకెవ్వరు’లో మరిన్ని కామెడీ సీన్లు
close
Published : 25/01/2020 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సరిలేరు నీకెవ్వరు’లో మరిన్ని కామెడీ సీన్లు

వెల్లడించిన నిర్మాణ సంస్థ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మహేశ్‌ మేనరిజమ్‌కు అనిల్‌ రావిపూడి కామెడీ టైమింగ్‌ తోడవ్వడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. మహేశ్‌లోని కామెడీ యాంగిల్‌ను చూసిన అభిమానులు ఇలాంటి సినిమా ‘నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌ ’ అంటూ కామెంట్లు చేశారు. 

ట్రైన్‌ సీక్వెన్స్‌లో వచ్చిన కామెడీ సినిమాకు హైలెట్‌గా ఉందంటూ చాలామంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మరిన్ని కామెడీ సన్నివేశాలను యాడ్‌ చేసి నేటి నుంచి ప్రదర్శించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ ట్వీట్‌ చేసింది. ‘థియేటర్లలో రేపటి నుంచి మరింత వినోదం ఉండనుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కొత్త కామెడీ సన్నివేశాలను యాడ్‌ చేస్తున్నాం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

మొదటిసారి ఆర్మీ మేజర్‌ పాత్రలో మహేశ్‌  నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొఫెసర్‌ భారతిగా విజయశాంతి కీలకపాత్రలో కనిపించారు. రష్మిక కథానాయిక. రావు రమేష్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత కీలకపాత్రలు పోషించారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని