ట్రెండింగ్‌లో ‘కాదలే కాదలే’ తెలుగు వెర్షన్‌
close
Published : 27/01/2020 16:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రెండింగ్‌లో ‘కాదలే కాదలే’ తెలుగు వెర్షన్‌

నెటిజన్లు మెచ్చిన ‘జాను’ పాట

హైదరాబాద్‌: విజయ్‌ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రలో నటించిన ప్రేమకావ్యం ‘96’. సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎందరో హృదయాలను హత్తుకుంది. ప్రేమకు సరైన నిర్వచనాన్ని తెలిపిన ఈ చిత్రాన్ని చూసి మరెందరో హృదయాలు ద్రవించాయి. 2018 అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా చూసి సినీ ప్రియులు, సెలబ్రిటీలు నటీనటులపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ సినిమాలో ‘కాదలే కాదలే’ అనే పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. ఈ పాటకు చిన్మయి గాత్రం ఒక కారణమయితే గోవింద్‌ వసంత్‌ అందించిన వయోలిన్‌ మ్యూజిక్‌ మరో ఎత్తు అనే చెప్పాలి. ఎంతో మధురమైన సంగీతం ఉన్న ఈ పాట తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది.

ఇదిలా ఉండగా తాజాగా ‘96’ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్‌ చేశారు. సమంత, శర్వానంద్‌ ప్రధాన పాత్రలో నటించారు. మాతృకను తెరకెక్కించిన సి.ప్రేమ్‌ కుమార్‌ తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ఆదివారం సాయంత్రం ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేసింది. ‘ఊహలే.. ఊహలే.. నిన్ను వీడవవులే’ అంటూ సాగే ఈ పాట తమిళంలోని ‘కాదలే.. కాదలే’ అనే పాటకు తెలుగు వెర్షన్‌. తెలుగు పాటను కూడా చిన్మయి అలపించారు. అలాగే గోవింద్‌ వసంత్‌ వయోలిన్‌ మ్యూజిక్‌ అందించారు. విడుదలైన కొంతసేపటిలోనే ఈపాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌ కైవసం చేసుకుంది. భాషలు వేరేనప్పటికీ పాటని బట్టి చూస్తే కథలోని అంతరార్థం అలాగే ఉందని తెలుస్తోంది. సమంత, శర్వానంద్‌ తప్పకుండా మంచి హిట్‌ను అందుకుంటారంటూ అంటూ నెటిజన్లు కామెంట్లలో పేర్కొంటున్నారు.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని